ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొని మొక్కలు నాటారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విసిరిన హరిత సవాల్‌ను గౌరవ్ ఉప్పల్ స్వీకరించి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆరు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయొచ్చన్నారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న గౌరవ్ ఉప్పల్, డీ.ఎస్.చౌహాన్