నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 25న శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. విజయ్‌నగర్‌కాలనీలోని మల్లేపల్లి బాలుర ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ మేళా జరుగుతుందని తెలిపారు. 7 కంపెనీలు పాల్గొంటుండగా, 400 ఉద్యోగాలు భర్తీ చేపట్టనున్నామన్నారు. అపోలో ఫార్మసీ, క్విస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడీబీఐ ఫెడరేల్, ఎల్‌ఐసీ లిమిటెడ్, వసంత టూల్‌క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్‌సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ పే, ఆర్‌ఎస్ బిజినెస్ సపోర్ట్ సొల్యూషన్స్ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ(కార్పెంటర్), డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీకాం, బీఏ, ఎంబీఏ, బీటెక్ చదివిన 19-30 ఏండ్ల మధ్య వయస్కులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి రూ.10వేల నుంచి 20వేల వరకు వేతనంగా ఇవ్వబడుతుందని, ఆసక్తి గల వారు తమ సర్టిఫికెట్లతో సహా జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ : 82476 56356 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మల్లేపల్లి బాలుర ఐటీఐలో రేపు జాబ్‌మేళా